అబ్బా... ఈ నానిగాడితో చచ్చిపోతున్నాను! తెగ సతాయిస్తున్నాడు. వీడెవడో నాకు కూడా పెద్దగా పరిచయం లేదు. ఈ బ్లాగు రాయడానికి రెండు వారాల ముందు కలిసాడు. ముందు పట్టించుకోలేదు. తరువాత తరువాత వీడి నస పెరిగేసరికి వీడెవడా అని కుతూహలం పెరిగింది. తెలివైనోడో, తింగరోడో తెలియట్లేదు. అన్నీ వాడే చెప్తాడు, ఏది అర్థం కావట్లేదు అంటాడు. వీడి గోల ఏమిటో మీకు కూడా చెప్తాను. కాస్త వినండీ, నా తలభారం కుడా కొద్దిగా తగ్గుతుంది.